కూర్చొకపోతే సస్పెండ్ చేస్తా.. కేటీఆర్, కౌశిక్ రెడ్డికి స్పీకర్ వార్నింగ్

కూర్చొకపోతే సస్పెండ్ చేస్తా.. కేటీఆర్, కౌశిక్ రెడ్డికి స్పీకర్ వార్నింగ్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. నాలుగవ రోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన కాసేపటికే అధికార, ప్రతిపక్షల మధ్య రాష్ట్ర అప్పులు, ఓవర్సీస్ స్కాలర్ షిప్‎ల విషయంలో మాటల యుద్ధం నడిచింది. ఓవర్సీస్ స్కాలర్ నిధుల విడుదల కోసం కమిషన్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ సభ్యులు కేపీ వివేకానంద ఆరోపించగా.. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుండి తొలగించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు మధ్య డైలాగ్ వార్ నడిచింది.

ఇదిలా ఉంటే.. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ మేరకు స్పీకర్‎కు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. బీఆర్ఎస్   తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సముదాయించగా.. వారు మాత్రం వెనక్కి తగ్గలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :- అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెళ్లి ఎవరి స్థానాల్లో వారు కూర్చొకపోతే సభ నుండి సస్పెండ్ చేస్తానని కేటీఆర్, కౌశిక్ రెడ్డిని స్పీకర్ హెచ్చరించారు. సభ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపైన అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు అధికారం పోగానే వేషం మారుస్తున్నారని విమర్శించారు.