ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై శాసనసభాపతి నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను ఈ ఐదేండ్లలో అమలు చేస్తామంటూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకంగా ఉంది. కొంతమంది తెలంగాణ అప్పుల గురించి మాట్లాడుతున్నారని... బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి దుబారాగా ఖర్చు పెడితే.... కాంగ్రెస్ ప్రభుత్వం.. రుణమఫీ.. మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. హైడ్రా విషయంలో స్పందించిన మంత్రి చెరువులు, వనరులను కాపాడటానికే నని.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి పని చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నరు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందన్న మంత్రి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారెంటీలనుఅమలు చేశామన్నారు.
తెలంగాణ ప్రజల కలను సోనియాగాంధీ సాకారం చేశారన్నారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతికంగా భారతదేశాన్ని మహనీయుడు రాజీవ్ గాంధీ అని.. అలాంటి మహనీయుడి విగ్రహంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు విషయంలో ఆలోచించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రజలను కోరారన్నారు.