- ఉమ్మడి జిల్లాలో ఘనంగా కాకా జయంత్యుత్సవాలు
నెట్‌వర్క్, వెలుగు: దివంగత కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాకా జయంత్యుత్సవాలను కాంగ్రెస్, బీజేపీ, ఇతర సంఘాల లీడర్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ కాకా అన్ని వర్గాల ప్రజలను అభ్యున్నతి కృషి చేసిన మహనీయుడని ప్రశంసించారు.
దేశం గర్వించదగ్గ గొప్ప దళిత నేతగా, ఎన్నో ఏండ్లు పార్లమెంట్ సభ్యునిగా కొనసాగారని వెల్లడించారు. 70 వేల గృహాలకు పట్టాలు అందించి గృహ దాతగా కాకా గుర్తింపు పొందారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని గుర్తించి ఆ జిల్లాకు వెంకటస్వామి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ఆఫీస్లో డీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్, సిటీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో సీఎస్ఐ చర్చిలో అన్నదానం చేపట్టారు. గోదావరిఖనిలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్, బీఈఎంఎల్ డైరెక్టర్ బల్మూరి వనిత, కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హుజూరాబాద్, జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో కాకా చిత్రపటం వద్ద నివాళులర్పించారు. పెద్దపల్లిలో స్ఫూర్తి దివ్యాంగుల ఆశ్రమంలో, సుల్తానాబాద్‌లో మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి జితేందర్ఆధ్వర్యంలో కాకాకు నివాళులర్పించారు. జి.సురేశ్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు. కోరుట్ల, మంథని, ధర్మపురి, ఎండపల్లి, ధర్మారం మండలకేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో కాకా జయంతి వేడుకలు నిర్వహించారు.