రూల్స్ ప్రకారం నడుచుకోండి.. స్లోగన్స్ చేయొద్దు: విపక్షాలకు స్పీకర్ సీరియస్ వార్నింగ్

రూల్స్ ప్రకారం నడుచుకోండి.. స్లోగన్స్ చేయొద్దు: విపక్షాలకు స్పీకర్ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‎గా సాగుతున్నాయి. ఐదో రోజు (డిసెంబర్ 19) ఉదయం సెషన్ ప్రారంభం కాగానే విపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు స్పీకర్‎కు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. పంట పెట్టుబడి, రుణమాఫీపై చర్చ కోరుతూ బీఆర్ఎస్.. జీవో నెం 317పై చర్చ జరపాలని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు.

దీంతో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ సముదాయించిన ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో విపక్ష పార్టీల సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు రూల్స్ ప్రకారం సభలో నడుచుకోవాలని సూచించారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించవద్దని.. స్లోగన్స్ చేయొద్దని చెప్పారు. విపక్ష సభ్యులు స్పీకర్ వెల్‏లోకి రావొద్దన్నారు. 

సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం సరికాదని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు సూచించారు స్పీకర్. ఇక, ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భా భారతి బిల్లును బుధవారం (డిసెంబర్ 18) మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ భూ భారతి బిల్లుపపై గురువారం (డిసెంబర్ 19) జరగనుంది.