భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది

భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది

భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోందని.. జీ 20 ఆర్థిక వ్యవస్థలలో తాము వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందన్నారు. వచ్చే పదేళ్లలో భారతదేశానికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని.. చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. లక్నోలో యూపీ పెట్టుబడుదారుల సదస్సులో సుమారు రూ. 80 వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, ఇదొక రికార్డు అన్నారు. 2022, జూన్ 03వ తేదీ శుక్రవారం లక్నోలో యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 3.0 జరుగుతోంది. ఈ సమ్మిట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందిరాగాంధీ ప్రతిష్టాన్​లో జరిగిన ఈ సమ్మిట్ లో మోడీ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఇటీవలే 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకోవడం జరిగిందని, సంస్కరణలు, పనితీరు.. ఇతర వాటిని అమలు పరుస్తూ.. పురోగించడం జరిగిందన్నారు.

సమన్వయంతో చేసుకుంటూ సులభంగా వ్యాపారం చేయడంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. నేడు భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోందని, దేశం యొక్క పని తీరును ప్రశంసిస్తోందన్నారు. G20 ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా దేశం అభివృద్ధి చెందిందని, గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లో దేశం రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో రూ. 80 వేల కోట్ల కంటే పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, దీని ఫలితంగా యువత ఎక్కవ ప్రయోజనం పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్య నాథ్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తల కోసం :-
రాహుల్ కు ఈడీ మరోసారి సమన్లు


ఇవాళ యూపీలో ఇన్వెస్టర్ల సదస్సు