కామారెడ్డికి రూ.18 కోట్లు​ శాంక్షన్​ : గంప గోవర్ధన్

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి నియోజక వర్గానికి రూ. 18.40 కోట్ల ఫండ్స్​శాంక్షన్​ అయినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ చెప్పారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో  మాట్లాడుతూ  ఎస్​డీఎఫ్ కింద రూ. 10 కోట్లు వచ్చాయన్నారు. ఇందులో రూ.3 కోట్లను టౌన్​లోని ఆయా ఏరియాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు కేటాయించామని చెప్పారు. రూ.7 కోట్ల ఫండ్స్​ నియోజక వర్గంలోని ఆయా గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్, ప్రార్థన మందిరాలకు శాంక్షన్​ అయ్యాయన్నారు.

కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి శివారులో  పీహెచ్​సీ బిల్డింగ్​ నిర్మాణంకు రూ. 2.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఎన్​ఆర్​ఈజీఎస్​ కింద  గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 6.20 కోట్ల ఫండ్స్​ వచ్చాయన్నారు.  భిక్కనూరు మండలంకు రూ.2 కోట్ల 5 లక్షలు,  కామారెడ్డి మండలానికి రూ. 40 లక్షలు,  దోమకొండకు రూ.1.35కోట్లు, బీబీపేటకు  రూ.95 లక్షలు,  రామారెడ్డికి రూ.25 లక్షలు, రాజంపేటకు రూ.10 లక్షల ఫండ్స్​ కేటాయించినట్లు చెప్పారు. ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మార్కెట్​ కమిటీ చైర్మన్​ వెంకటి, వైస్ ​చైర్మన్ ​ రవి, టౌన్​ ప్రెసిడెంట్ జూకంటి ప్రభాకర్​రెడ్డి,  గోపిగౌడ్​ఉన్నారు. 

పూర్ణ ఇల్లు ప్రారంభం

పిన్న వయస్పులో  ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణకు ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇల్లు కట్టించింది. ఆ ఇల్లును శుక్రవారం విప్​ గంప గోవర్ధన్​ ప్రారంభించారు.