వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక బోర్డు

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక బోర్డు

హైదరాబాద్, వెలుగు: వన్యప్రాణుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకం గా స్టేట్ పునర్ నిర్మాణ బోర్డును ఏర్పా టు చేసింది. ఈ మేరకు సోమవారం జీవో జారీచేసింది. బోర్డుకు మూడేం డ్ల కాలపరిమితి విధించింది. బోర్డు  చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా మంత్రి కొండా సురేఖ, సభ్యులుగా ఎమ్మెల్యేలు వెడమబొజ్జు, వంశీకృష్ణ, భూక్యా మురళీ నాయక్ తో పాటు మరో 25మంది సభ్యులుగా ఉంటారు. ఎన్జీవోలు, పర్యావరణవేత్తలు, అధికారులను సభ్యులుగా నియమిం చారు. చీఫ్ వైల్డ్ లైప్ వార్డెన్ ఇలు సింగ్ మీరాను మెంబర్ ఆఫ్ సెక్రటరీ గా నియమించారు. ఈ బోర్డు ద్వారా వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన అంశాలపై చర్యలు చేపట్టనున్నారు.