
పెద్దపల్లి: దళితుల అభ్యున్నితికి స్పెషల్ బడ్జెట్ కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ..గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళుర్పించారు. వంశీకృష్ణకు అంబేద్కర్ సంఘం నేతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ తో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించానన్నారు. కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిచారని చెప్పారు. మాజీమంతరి వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ రివైజ్ చేసి పదివేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వంశీకృష్ణ తెలిపారు.
రామగుండం ఎన్టీపీసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రికి లేఖ రాసినట్లు పెద్ద ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. ఎన్టీపీసీ అధికాురులు నిర్వాతులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహం, పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.