భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ల నుంచి మేడారానికి స్పెషల్బస్ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం డిపో మేనేజర్బాణాల వెంకటేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
బుధవారం నుంచి డెయిలీ ఉదయం 6.30 గంటలకు కొత్తగూడెం బస్టాండ్ లో, పాల్వంచ బస్టాండ్నుంచి 7 గంటలకు బస్బయల్దేరి వెళ్తుందని తెలిపారు. 11 గంటలకల్లా మేడారం చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మేడారం నుంచి బయల్దేరి పాల్వంచ, కొత్తగూడెం చేరుకుంటుందన్నారు.