మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

హనుమకొండ, వెలుగు: మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ దేవస్థానాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వరంగల్ ఆర్​ఎం జె.శ్రీలత తెలిపారు.   ఖ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్పకు ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తామని,  వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి మొత్తంగా 259  ట్రిప్పుల వరకు నడిపిస్తామని చెప్పారు.

ఈనెల 7, 8, 9 మూడు రోజులపాటు శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.  హనుమకొండ నుంచి కాళేశ్వరానికి 30 బస్సులు,  వరంగల్ వన్ డిపో నుంచి పాలకుర్తికి 8 బస్సులు, తొర్రూరు డిపో పాలకుర్తికి 12 , మహబూబాబాద్ డిపో కురవికి 15 బస్సులు నడిపిస్తామన్నారు. జనగామ డిపో నుంచి కొమురవెల్లికి 20 బస్సులు, హనుమకొండ డిపో మెట్టుగుట్టకు మూడు బస్సులు, వరంగల్ 2 డిపో నుంచి రామప్పకు 15 బస్సులు, హనుమకొండ డిపో నుంచి  వేములవాడకు 30 బస్సులు, నర్సంపేట డిపో నుంచి  వేములవాడకు 10 బస్సులు, పరకాల డిపో నుంచి వేములవాడకు 8  బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు.  

హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రతి  15 నిమిషాలకు ఒక బస్సు వేములవాడ వెళ్తుందన్నారు.  అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా కాళేశ్వరానికి, రామప్పకు, పాలకుర్తికి  బస్సులు నడిపిస్తామని వివరించారు.