మేడారం జాతరకు స్పెషల్​ బస్సులు

కోరుట్ల, వెలుగు: మేడారం జాతరకు కోరుట్ల డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతామని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ఎం సుచరిత పేర్కొన్నారు. మంగళవారం కోరుట్ల ఆర్టీసీ డిపోను డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తామని ఆర్టీసీ సిబ్బందితో ఆర్ఎం ప్రమాణం చేయించారు. ఈ నెల 18 నుంచి మేడారం జాతర కు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎం విజయమాధురి, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.