తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేపడుతోంది ప్రభుత్వం. జాతర దృష్ట్యా ఇప్పటి నుంచే భక్తుల రాక పోకలు పెరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తోంది.
ప్రజల సౌకర్యార్ధం హైదరాబాద్ MBGS నుండి మేడారానికి స్పెషల్ బస్సులు పెట్టడం జరిగిందని ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. https://tsrtconline.in Website, #TSRTC App నుంచి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాదు #TSRTCMedaramSpecial నుంచి కూడా మేడారంకు బస్ టికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 16 నుంచి MBGS నుంచి ఈ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ట్వీట్ చేశారు విసి సజ్జనార్. అంతేకాదు బస్ చార్జీ రూ.398లుగా ఉండనున్నట్లు తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం #MGBS నుండి మేడారం కు స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది https://t.co/EE9pOiiegh Website మరియు #TSRTC App నందు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు #TSRTCMedaramSpecial @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @TV9Telugu @sakshinews @eenadulivenews @bbcnewstelugu @Postfity pic.twitter.com/U0cfcNLYF9
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 11, 2022
మరిన్ని వార్తల కోసం..