వేములవాడకు ప్రత్యేక బస్సులు

వేములవాడకు ప్రత్యేక బస్సులు

కరీంనగర్ టౌన్,వెలుగు : కార్తీక మాసం పురస్కరించుకుని వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల  కోసం శని,ఆదివారాల్లో వరంగల్‌‌‌‌ నుంచి వేములవాడకు, సోమ, మంగళ వారాల్లో వేములవాడ నుంచి వరంగల్‌‌‌‌కు ప్రత్యేక  బస్సులు  నడుపుతున్నట్లు ఆర్ఎం సుచరిత బుధవారం తెలిపారు. 

శబరిమలై, అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం టీజీఎస్‌‌‌‌ఆర్టీసీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను లేదా సమీపంలోని డీఎంలను సంప్రదించాలని పేర్కొన్నారు.