ఇయ్యాల్టి నుంచి మేడారంకు స్పెషల్ బస్సులు ప్రారంభం

మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఆదివారం నుంచి స్పెషల్​బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. హనుమకొండ, జనగామ డిపోల్లో ప్రత్యేకంగా బస్​స్టాపులు ఏర్పాటు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్​ఎదురుగా ఉన్న న్యూ బస్ స్టేషన్ నుంచి మేడారానికి 430 స్పెషల్ ​సర్వీసులు నడుపుతున్నట్లు హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ శనివారం వెల్లడించారు. 

25వ తేదీ వరకు స్పెషల్​బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జనగామ డిపో నుంచి మొత్తం 280 స్పెషల్​బస్​సర్వీసులు ఏర్పాటు చేశామని, ప్రెస్టన్ గ్రౌండ్​ నుంచి బస్సులు మొదలవుతాయని జనగామ డిపో మేనేజర్ వి.జ్యోత్స్నతెలిపారు.