హైదరాబాద్సిటీ, వెలుగు: చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ చర్లపల్లి డిపో మేనేజర్ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్నుంచి 250సీ బస్సు రెగ్యులర్గా కొనసాగుతోందన్నారు. ఇక నుంచి ప్రతి10 నిమిషాలకో బస్సు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ప్రతి రోజూ ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10.30గంటల వరకూ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే చర్లపల్లి రైల్వే టెర్మినల్నుంచి బోరబండకు 113ఎఫ్/జెడ్నంబరు బస్సు, చెంగిచెర్ల, ఉప్పల్, రామంతాపూర్కు ప్లాట్ఫారం నెం.9 నుంచి ప్రతి 40 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. సంక్రాంతి స్పెషల్ ట్రెయిన్లను దృష్టి పెట్టుకొని ఉప్పల్ నుంచి బస్సులు నడపనున్నట్టు తెలిపారు.