
ఐపీఎల్ వచ్చిందంటేనే క్రికెట్ ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. ఇక మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉందంటే ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. స్టేడియానికి వెళ్లి మరీ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తారు. దీంతో మ్యాచ్ రోజున హైదరాబాద్ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ ట్రాఫిక్ ను ఉద్దేశించి తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకోసం హైదరాబాద్ లో స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. మొత్తం 24 రూట్లలో ఈ బస్సులు నడవనున్నాయి.
ALSO READ | ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులను అలరించనున్న తమన్
ఐపీఎల్ కు వచ్చే ఫ్యాన్స్ కి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను పలు హైదరాబాద్ లోని ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఆపరేట్ చేయనున్నట్టు వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్న తేదీల్లో ఈ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 6 ,ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే 10, మే 20, మే 21 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లకు ఈ ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను అరేంజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు
ప్రధానంగా ఘట్ కేసర్, హయత్ నగర్ ఎన్జీవోస్ కాలనీ ,ఎల్బీనగర్, కోటి, లకిడికపూల్, దిల్ సుఖ్ నగర్, మేడ్చల్, కెపీహెచ్ బీ, మియాపూర్ జేబీఎస్ ఈసీఐఎల్ బోయిన్ పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఈ స్పెషల్ బస్సులు నడుస్తాయి.