కోల్బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియా ఉద్యోగులు, కార్మికులు బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో సింగరేణి స్థాయిలో బెస్ట్ఏరియాగా అవార్డు దక్కించుకుందని ఏరియా జీఎం జి.దేవేందర్అన్నారు. బుధవారం మంద మర్రి జీఎం ఆఫీస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెస్ట్ఏరియాగా సాధించిన రోలింగ్షీల్డ్ను ఆఫీ సర్లు జీఎంకు అందజేశారు.
సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని 4వ బెస్ట్ ఏరియాగా మందమర్రిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు, ఆఫీసర్లను జీఎం అభినందించారు. కార్యక్రమంలో సివిల్ ఎస్ఈ రాములు, డీవైఎస్ఈలు జయప్రకాశ్, శ్రీధర్, ఇన్చార్జి పీఎం మైత్రేయబంధు తదితరులు పాల్గొన్నారు.