
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశం కోసం ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు రాసిన ఎంట్రన్స్టెస్ట్ఫలితాలు శనివారం రిలీజ్ చేస్తామని ఎస్టీ గురుకుల సెక్రటరీ, సెట్ కన్వీనర్ అలుగు వర్షిణి వెల్లడించారు.
ప్రత్యేక కేటగిరీలో వికలాంగులు(పీహెచ్ సీ) , ఆర్ఫన్(అనాథలు) , ఫిషర్ మన్ (మత్స్య కార్మికులు) మైనారిటీ, క్యాప్, ఈడబ్ల్యూఎస్, ఏఈక్యూ , ఏజెన్సీ ఏరియా, ఎంబీసీ కేటగిరీలు ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా కేటగిరీలకు చెందిన ఫలితాలను వచ్చే నెల 5 వ తేదీలోపు వెల్లడిస్తామని పేర్కొన్నారు.