ఎండలు దంచి కొడుతుంటే  సమ్మర్​లో స్పెషల్​ క్లాసులట!

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు:  ఓ దిక్కు ఎండలు దంచి కొడుతుంటే సోషల్‌‌‌, బీసీ వెల్ఫేర్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూళ్లలో  స్టూడెంట్లకు సమ్మర్‌‌ క్యాంప్‌‌ నిర్వహించడానికి ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఏప్రిల్‌‌ 22 నుంచి మే10వ తేదీ వరకు తొమ్మిదో తరగతి పూర్తయిన స్టూడెంట్ల కోసం స్పెషల్‌‌ క్లాసులు నిర్వహించనున్నట్టు విద్యాసంస్థల సెక్రటరీలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే స్టూడెంట్ల తల్లిదండ్రులకు టీచర్లు ఫోన్ ​చేసి క్యాంపులకు తీసుకెళ్తున్నట్టు సమాచారం ఇచ్చారు. కాగా, ఎండలు పెరుగుతుంటే స్పెషల్‌‌ క్లాస్‌‌లు ఏమిటని పేరేంట్స్‌ నిలదీస్తున్నారు.

రాష్ట్రంలో సోషల్‌‌ వెల్ఫేర్‌‌, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్‌‌, మైనార్టీ, ఎస్టీ వెల్ఫేర్‌‌, టీఎస్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూల్స్‌‌, కేజీబీవీ లాంటి సంస్థల ఆధ్వర్యంలో  దాదాపు 12 వందల గురుకుల స్కూళ్లున్నాయి. ఇందులో 60 వేల మంది తొమ్మిదో తరగతి పూర్తి చేశారు. అయితే..సోషల్‌‌ వెల్ఫేర్‌‌, బీసీ రెసిడెన్షియల్‌‌ స్కూళ్ల విద్యార్థులకు మాత్రమే స్పెషల్‌‌ క్లాస్‌‌లు నిర్వహిస్తుండగా, ఇందులో చదువుతున్న 25 వేల మంది సమ్మర్​హాలీడేస్​లో ఇంటి ముఖం చూడకుండానే స్పెషల్​ క్లాసులకు అటెండ్ ​కావాల్సి వస్తోంది.

మైనార్టీ, ఎస్టీ వెల్ఫేర్‌‌, టీఎస్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూల్స్‌‌, కేజీబీవీల విద్యార్థులు మాత్రం సెలవులకు ఇండ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్పెషల్‌‌ క్లాస్‌‌లు నిర్వహించాలన్న ఆర్డర్‌‌ను రద్దు చేయాలని టీచర్స్​‌ఎమ్మెల్సీ ఏవీఎన్‌‌ రెడ్డి..మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్‌‌ సొసైటీ సెక్రెటరీకి ఈ నెల 18న లెటర్​రాశారు.