కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?

కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?

వికారాబాద్ జిల్లాలో ట్రాలీలో పావురాలను తెచ్చి వదలడం కలకలం రేపింది. పరిగి లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా 20 బాక్సులలో సుమారు 300 పావురాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. 

ఇద్దరు వ్యక్తులు రెండు బాక్సులలోనీ 40 పావురాలను ఆకాశంలోకి వదిలారు. మిగతా పావురాలను వదులుతుండగా అక్కడ వాకింగ్ చేస్తున్న పరిగి స్థానికులు ఇక్కడ పావురాలను ఎందుకు వదులుతున్నారు అంటూ నిలదీశారు. పావురాలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు అగంతకులు  తెలిపారు. 

పరిగిలో వైరస్ వ్యాప్తి చేసేందుకే  ఇక్కడ పావురాలను వదులుతున్నట్టు అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వద్దు అంటూ బేరసారాలకు దిగారు దుండగులు. పావురాలను , వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అప్పజెప్పారు స్థానికులు.

పావురాల కాళ్లు, బాక్సులపై కోడ్ నంబర్లు

 పావురాల కాళ్లకు కోడ్ నెంబర్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. పావురాల బాక్సులను ఆటోలో తీసుకువచ్చిన మునావర్, బూబు జానీ లను అదుపులో తీసుకొని  పోలీసులు విచారిస్తున్నారు. 

ALSO READ | ఇబ్రహీంపట్నంలో సందడిగా దీక్షాంత్ పరేడ్

విచరాణలో సదరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరిట్ల గ్రామానికి చెందిన మునావర్, బాబు జానీ అనే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. పావురాలను ఎందుకు వదులుతున్నారని ప్రశ్నించగా.. పదిమంది యజమానులు పావురాల పోటీలో పాల్గొన్నామని.. ఎవరి పావురాలు ముందు వస్తే  వారు గెలిచినట్లుగా పందెం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పావురాలు సుమారు 300 కి.మీ ప్రయాణం చేస్తాయని పావురాల ట్రేనర్ మునావర్ తెలిపాడు.