- హబీబ్‌నగర్‌లోని 45 మంది అనాధాశ్రమానికి తరలింపు
హైదరాబాద్,వెలుగు: బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇందులో భాగంగా మంగళవారం వెస్ట్‌జోన్ పరిధి హబీబ్ నగర్‌లో ఇన్ స్పెక్టర్ ఎం.నరేందర్ తో పాటు స్థానిక పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దర్గా యూసుఫైన్, కట్టమైసమ్మ టెంపుల్, ఎస్ డీ నగర్, సేవక్ నగర్, భరత్ నగర్ లో మొత్తం 60 మందిని ట్రేస్ చేశారు. వీరిలో 45 మందిని బెగ్గర్స్ గా గుర్తించి వారిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని అమ్మనాన్న అనాధాశ్రమానికి తరలించారు. సిటీ కమిషనరేట్‌పరిధిలోని 5 జోన్లలో స్పెషల్ డ్రైవ్ ఉంటుందన్నారు.