ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గద్వాల, వెలుగు: కొత్త ఓటర్ నమోదు కోసం కాలేజీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్  హాల్లో ఏఈఆర్వో,  ఆర్వోఆర్​కు ఓటర్ నమోదు, మార్పు చేర్పులపై మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1 జనవరి 2023 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.   కొత్త ఓటర్ ఎన్​రోల్​కోసం ఫామ్​–6 ద్వారా ఆన్ లైన్, లేదా ఆఫ్​లైన్​ద్వారా  అప్లై చేసుకోవచ్చన్నారు. ఈ నెల 26 లోగా అన్ని సమస్యలు పరిష్కరించి ఆఫీసర్లందరూ  సమన్వయంతో తప్పులు లేకుండా ఓటర్​లిస్టు రెడీ చేయాలని ఆదేశించారు. భారత్ మాల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని ఆదేశించారు.  అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, తహసీల్దార్లు పాల్గొన్నారు.

‘మన బడి’  పనులను వేగంగా పూర్తి చేయాలి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్​జిల్లాలో ఫస్ట్​ఫేజ్​లో గవర్నమెంట్​స్కూళ్లలో చేపట్టిన ‘మన ఊరు - మన బడి’  పనులను వేగంగా పూర్తి చేయాలని పి.ఉదయ్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం అడిషనల్​కలెక్టర్ మనూ చౌదరితో కలిసి ‘మన ఊరు -మనబడి’, కేజీబీవీల్లో మౌలిక వసతులపై  రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లలో జరుగుతున్న నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని కలెక్టర్  ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంఈవోల పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. కేజీబీవీలో ఉన్న  ఫండ్స్​కు అనుగుణంగా పనులను చేపట్టాలని ఆదేశించారు. కేజీబీవీల్లో విద్యను మెరుగుపరిచేందుకు కొంత మంది  టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.  కమిట్​మెంట్​తో పనిచేసే టీచర్లను ఎంపిక చేయాలని ఎంఈవోలను ఆదేశించారు. డీఈవో గోవిందరాజులు, గణాంక అధికారి ఈశ్వరప్ప, సెక్టోరల్ ఆఫీసర్లు సూర్య చైతన్య, వెంకటయ్య పాల్గొన్నారు. 

వైస్ ఎంపీపీపై మానవ హక్కుల కమిషన్ కు ​ఫిర్యాదు

ధన్వాడ, వెలుగు: మండల టీఆర్ఎస్​లీడర్, వైస్​ఎంపీపీ జీఎస్. రాజేందర్​రెడ్డి తనపై దాడి చేసి, తన భార్యను, తల్లిని బూతులు తిట్టాడని
 ఆయనపై చర్యలు తీసుకోవాలని  మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు గద్దెగూడెం కృష్ణయ్య సోమవారం మానహక్కుల కమిషన్​కు కంప్లైంట్​చేశారు. తాను రాజేందర్​రెడ్డి   సోదరుడు రవీందర్​రెడ్డి వద్ద కొంత డబ్బు చేతి బదులు తీసుకున్నానని, దీంతో రాజేందర్​రెడ్డి తమకు  రూ. 1.80 లక్షలు బాకీ ఉన్నావంటూ దివ్యాంగుడైన తనపై దాడి చేసి ఇబ్బందులకు గురిచేశాడన్నారు. అప్పుకింద 180 బస్తాల వడ్లను బలవంతంగా తీసుకెళ్లాడని, ఇంకా బకాయి ఉందని వేధిస్తే గ్రామపెద్దలు మిగతా డబ్బులు కట్టిస్తామని చెప్పినా ఆయన తన కుటుంబ సభ్యులను బెదిరించాడని చెప్పారు. ఈ విషయమై ధన్వాడ పోలీస్​స్టేషన్​లో  కంప్లైంట్​చేసినా... వైస్​ఎంపీపీ  టీఆర్ఎస్​లీడర్ అని కేసు నమోదు చేయలేదన్నారు. కమిషన్​స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. 

ఏబీవీపీ జిల్లా కన్వీనర్​గా జగదీశ్

వనపర్తి టౌన్/మరికల్, వెలుగు: వనపర్తి జిల్లా ఏబీవీపీ కొత్త కన్వీనర్ గా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం కు చెందిన జగదీశ్​ను నియమించారు. రెండు రోజుల కింద నారాయణ పేట జిల్లా మరికల్ లో జరిగిన  ఏబీవీపీ పాలమూరు విభాగ్ అభ్యాస వర్గ సమావేశంలో జగదీశ్​ను వనపర్తి జిల్లా కన్వీనర్ గా నియమించారు.  ఈ సందర్భంగా జగదీశ్​ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

హాస్టల్స్ కన్వీనర్​గా నవీన్​రెడ్డి

ఏబీవీపీ పాలమూర్​ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్​గా నవీన్​రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు విభాగ్​ప్రముఖ్​కర్నె రాంచందర్​ సోమవారం తెలిపారు. మండల కేంద్రంలో రెండు రోజుల పాటు ఆ శాఖ శిక్షణా తరగతుల ముగింపులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి  జిల్లాలోని  హాస్టల్స్​ను విజిట్​చేసి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని నవీన్​రెడ్డి పేర్కొన్నారు. 

కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు మన కలెక్టరేట్ల కంటే చిన్నవి

మహబూబ్ నగర్, వెలుగు: కొన్ని రాష్ట్రాల సచివాలయాలు తెలంగాణలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ల కంటే కూడా చిన్నవని, మన ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ ఆఫీసులు ప్రజలందరికీ ఒకే చోట సేవలందించే విధంగా విశాలంగా  నిర్మిస్తున్నామని  పర్యాటక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  జిల్లాలో డిసెంబర్ 4న  సీఎం కేసీఆర్ టూర్​నేపథ్యంలో సోమవారం కలెక్టర్, ఎస్పీ తో సహా జిల్లా అధికారులతో కలిసి మంత్రి పట్టణంలో పర్యటించారు. కొత్త కలెక్టరేట్, నెక్లెస్ రోడ్, శిల్పారామం, పార్టీ ఆఫీస్​, పాత కలెక్టరేట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ఏపీ రాజధాని కర్నూలులో సచివాలయాన్ని గుడారాల్లో నడిపారని గుర్తు చేశారు. పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని, ఈ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు.  ప్రస్తుతం పట్టణానికి ఒక బైపాస్ ఉండగా త్వరలో చించోలి హైవే రూపంలో మరో బైపాస్ అందుబాటులోకి వస్తుందన్నారు. 

పర్యాటక ప్రాంతంగా శిల్పారామం.. 

పట్టణంలో నిర్మితమవుతున్న శిల్పారామం, మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సస్పెన్షన్ బ్రిడ్జి అన్నీ కలిపి ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నెక్లెస్ రోడ్డు, శిల్పారామం పనులను ఆయన పరిశీలించారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పర్యాటకశాఖ ఎండీ మనోహర్ తదితరులు ఉన్నారు.             

డాక్టర్లపై బాధితుల ఫిర్యాదు

గద్వాల, వెలుగు: జిల్లా ప్రభుత్వాస్పత్రిని అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్ సోమవారం  పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆయన పలు వార్డులను  తనిఖీ చేశారు. ఆదివారం హాస్పిటల్ లో డెలివరీ అయిన వెంటనే పసికందు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే హాస్పిటల్లో  అడిషనల్​కలెక్టర్​ఎంక్వయిరీ చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది. 
హాస్పిటల్ నిర్లక్ష్యంగా వ్యవహరించి  పసికందు మృతికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులపాటు హాస్పిటల్ లో ఉన్నా తమను పట్టించుకోలేదని  స్కానింగ్ కోసం ప్రైవేట్ హాస్పిటల్​కు పంపించారని వారు ఆరోపించారు. స్కానింగ్​లో ఈ నెల18న  డెలివరీ డేట్ ఇచ్చినా.. పట్టించుకోలేదన్నారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. 

నేరడగంలో ఘనంగా లక్షదీపోత్సవం

మాగనూర్, వెలుగు:  కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తే అన్ని దేవుళ్లకు పూజలు చేసిన పుణ్యం వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మాగనూర్ మండలంలోని నేరడగం గ్రామంలోని పశ్చిమాద్రి విరక్తమఠంలో మఠాధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామి ఆధ్వర్యంలో సోమవారం లక్షదీపోత్సవం కార్యక్రమాన్ని  ప్రారంభించారు. సిద్ది లింగేశ్వర మఠం పూజారులు,  కలెక్టర్, మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాష,  డీఎస్పీ సత్యనారాయణ, కర్ణాటక రాష్ట్రంలోని 25 మఠాలకు సంబంధించిన పీఠాధిపతులు పాల్గొన్నారు. 

వనపర్తి  డీఎంహెచ్​వోగా  ఆర్​. లాల్ ప్రసాద్

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కొత్త డీఎంహెచ్ వో గా డాక్టర్ ఆర్. లాల్ ప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఇన్​చార్జి డీఎంహెచ్​వో డాక్టర్ రవి శంకర్ కొత్త డీఎంహెచ్ వో కు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆర్. లాల్​ప్రసాద్​ జిల్లాలో  గతంలో  అతడు మెడికల్ ఆఫీసర్ గా పనిచేసిన పెద్దమందడి పీహెచ్ సీ ని విజిట్​చేశారు. అక్కడి డాక్టర్లు, సిబ్బందితో సమావేశమై ఆస్పత్రిలో అందిస్తున్న  వైద్య సేవల గురించి  అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సాయినాథ్ రెడ్డి, పెద్దమందడి పీహెచ్ సీ సిబ్బంది పాల్గొన్నారు. 

ముదిరాజులు ఉద్యమానికి సిద్ధం కావాలి

నెట్​వర్క్​, వెలుగు: హక్కుల సాధన కోసం మత్స్యకారులు ఉద్యమానికి సిద్ధం కావాలని ముదిరాజ్​సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బైక్​ర్యాలీలు, ఆత్మీయ సమ్మేళనాలు, జెండాపండుగ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ  గద్వాలలో గంగమ్మ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముదిరాజ్ లను బీసీ‘ ఏ’ గ్రూప్​లో చేర్చాలని డిమాండ్​చేశారు.   

జడ్పీ స్థాయీ సంఘం మీటింగ్​ వాయిదా

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :   జడ్పీ స్థాయీ సంఘం సమావేశానికి జిల్లా అధికారులు హాజరు కాకపోవడంతో  మీటింగ్ ను వాయిదా వేశారు. సోమవారం నాగర్ కర్నూల్ లోని జడ్పీ స్థాయీ సంఘం మీటింగ్ గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, విద్య,  వైద్యంపై నిర్వహించారు.   ఐదు డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు హాజరు కావాల్సి ఉండగా, ఇద్దరు కిందిస్థాయి అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగతా  3  డిపార్ట్​మెంట్​అధికారులు రాకపోవడంతో మీటింగ్​ను వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి ప్రకటించారు. గత  మూడేళ్ల నుంచి జడ్పీ  స్థాయీ సంఘం మీటింగులకు జిల్లా అధికారులు డుమ్మా కొడుతున్నారని , దీనిపై నోటీసులు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి జిల్లా స్థాయి అధికారులు హాజరుకావాలని కోరారు.  అనంతరం పశువైద్యం, నకిలీ విత్తనాలపై సమీక్షించారు. 
ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్​