ఓటర్‌‌ లిస్ట్‌‌ సవరణకు స్పెషల్‌‌ డ్రైవ్‌‌

మహబూబాబాద్‌‌/కురవి, వెలుగు : ఓటర్‌‌ లిస్ట్‌‌లో సవరణలు చేసేందుకు ఈ నెల 21, 22 తేదీల్లో స్పెషల్‌‌ డ్రైవ్‌‌ చేపట్టామని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ అద్వైత్‌‌కుమార్‌‌ సింగ్‌‌ చెప్పారు. మహబూబాబాద్‌‌ మండలంలోని బేతోల్, మల్యాల, చౌక్లాతండా, కురవి మండలం కురవి, తాళ్ల సంకీస గ్రామాల్లో ఆదివారం పర్యటించి, బీఎల్‌‌వోల పనితీరును పరిశీలించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. పెండింగ్‌‌ అప్లికేషన్ల పరిశీలన సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని సూచించారు. ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్‌‌ వెంట మహబూబాబాద్, డోర్నకల్ ఆర్డీవోలు అలివేలు, నరసింహారావు, తహసీల్దార్లు భగవాన్‌‌రెడ్డి, సునీల్‌‌రెడ్డి, నరేశ్‌‌ పాల్గొన్నారు.