- బాధితులకు రావాల్సిన రూ.2.48కోట్ల నష్టపరిహారం ఇప్పిస్తా
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలోని పెండింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ల్యాండ్ సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, భూ సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యులతో బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులపై నిర్లక్ష్యం వహిస్తే కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రతి మూడు నెలలకోసారి డీఎంసీ, ప్రతి నెలా సివిల్ రైట్స్ సమావేశాలు నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని బాధితులకు అట్రాసిటీ నష్టపరిహారం కింద రూ.2 కోట్ల48లక్షలు రావాల్సి ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 1,216 అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉన్నాయని, పరిష్కార కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.
భూమికి సంబంధించి నాలుగు కేసులు పెండింగ్ లో ఉన్నాయని పరిశీలన చేసి నెలలోగా పరిష్కరించాలన్నారు. అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) ముకుంద రెడ్డి, డీసీపీ శ్వేత, కమిషన్ మెంబర్స్జిల్లా శంకర్, కురసం జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మెంబర్స్బి.రాంప్రసాద్, బి.ఎల్లేశ్, డి.సుదర్శన్ బాబు, ఇటిక గోపి, బి.వెంకటేశ్వర్ రావు, ఎన్జీఓ పులి కల్పన, డీఆర్ఓ వెంకటాచారి, డీడీ సోషల్ వెల్ఫేర్ ఆర్.కోటాజీ, ఆర్డీఓలు సాయిరామ్, రామకృష్ణ పాల్గొన్నారు.