సీవరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ స్పెషల్ డ్రైవ్..హైదరాబాద్ లో 50వేల మ్యాన్ హోల్స్ క్లీన్

సీవరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ స్పెషల్ డ్రైవ్..హైదరాబాద్ లో 50వేల మ్యాన్ హోల్స్ క్లీన్

హైదరాబాద్:సిటీలోని మ్యాన్ హోల్స్ క్లీనింగ్ లక్ష్యంగా జలమండలి చర్యలు చేపడుతోంది.  అక్టోబర్ 2 నుంచి నగర వ్యాప్తంగా సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 6వేల 140 ప్రాంతాల్లో దాదాపు 700 కిలోమీటర్ల మేర సీవరేజ్ పైప్ లైన్ డీసిల్టిండ్ పనులు పూర్తి చేశారు. దాదాపు 50 వేల మ్యాన్ హోల్స్ క్లీన్ చేశారు.90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా దీర్ఘకాలికంగా ఉన్న సివరేజ్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. 

సరైన క్లీనింగ్​లేక 20 ఏండ్లుగా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్​బోర్డు పనులు షురూ చేసింది. గ్రేటర్​పరిధిలో చిన్న వాన పడితే చాలు అనేక ప్రాంతాల్లో, మెయిన్​రోడ్లపైన డ్రైనేజీ ఓవర్​ఫ్లో అయి కంపు కొడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైనేజీ పొంగినప్పుడు పై‌‌పైన క్లీన్​చేసి వదిలేస్తున్నారు. ఏండ్లుగా పేరుకుపోయిన సిల్ట్​(పూడిక)ను పట్టించుకోవడం లేదు.

 ఈ కారణంగా సమస్య మళ్లీ మళ్లీ పునరావృతమవుతోందని వాటర్​బోర్డు గుర్తించింది. ఈ సమస్యకు చెక్​పెట్టేందుకు ప్రస్తుతం నడుస్తున్న 90 రోజుల స్పెషల్​డ్రైవ్​లో ప్రతి మ్యాన్​హోల్​ను క్లీన్​చేయాలని నిర్ణయించింది. 

గ్రేటర్​వ్యాప్తంగా చిన్నచిన్నవి మినహా 4 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు మ్యాన్​హోల్స్​4 లక్షల వరకు, మెయిన్​రోడ్లపై ట్రంక్​మెయిన్లు(15 నుంచి 20 అడుగుల లోతు) 50 వేలకు పైగా ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తిగా క్లీన్​చేస్తే మరో పదేండ్ల వరకు డ్రైనేజీ ఓవర్​ఫ్లో సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.  

25  స్పెషల్​ టీమ్స్..

90 రోజుల్లో మూడున్నర లక్షల మ్యాన్​హోల్స్​క్లీన్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు వాటర్ బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు.రోజుకు 400 మ్యాన్​ హోల్స్ క్లీనింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఇందుకోసం 25 స్పెషల్​టీమ్స్​ను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్​లో ఐదుగురు సిబ్బంది ఉంటారన్నారు.

మ్యాన్​హోల్స్​క్లీనింగ్​కోసం 200 ఎయిర్ టెక్ మెషీన్లు వినియోగిస్తున్నారు. పూడిక తీసిన తర్వాత వ్యర్థాలను తరలించడానికి మరో 140 సిల్ట్ క్యారియర్ వాహనాలను అందుబాటులో ఉంచారు. 

20 ఏండ్లలో మహానగరంలో ఈ స్థాయిలో డీ సిల్టింగ్ పనులు చేపట్టడం ఇదే మొదటిసారి. వచ్చే వర్షాకాలం నాటికి గ్రేటర్​ను సీవరేజ్​ఓవర్​ ఫ్లో ఫ్రీ సిటీగా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.  

సుల్తాన్​బజార్​లో పర్యటించిన ఎండీ

సీవరేజీ డీసిల్టింగ్​పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి సుల్తాన్ బజార్ లో పర్యటించారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు సిల్ట్ కార్టింగ్ వాహనాల ద్వారా తరలించాలని సూచించారు. వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, వసతి గృహాలు తదితర యజమానులకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆ సూచనలు పాటించని పక్షంలో వారికి నోటీసులు జారీ చేయాలన్నారు.