తిరుమల వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో మే నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. మే నెలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. శ్రీ గోవింద రాజుస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించనున్నారు. వాటి వివరాలను టీటీడి ప్రకటించింది.
తిరుమలలో మే నెలల జరిగే విశేష ఉత్సవాలపై టీటీడీ ప్రకటన చేసింది. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతాయని తెలిపింది. మే మాసానికి సంబంధించి జరిగే విశేష ఉత్సవాల పూర్తి వివరాలను వెల్లడించింది. మే 10న అక్షయతృతీయ ఉంటుందని తెలిపింది. అలాగే మే 16 నుంచి 24 వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. .
తిరుమలలో మే నెలలో విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.. మే 4న సర్వ ఏకాదశి. మే 10న అక్షయతృతీయ.. మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి నిర్వహిస్తారు. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. మే 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి ఉంటుంది. మే 23న శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి నిర్వహిస్తారు.
మే 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
- మే నెల 16న ఉదయం – ధ్వజారోహణం.. రాత్రి – పెద్దశేష వాహనం.
- మే 17న ఉదయం – చిన్నశేష వాహనం.. రాత్రి – హంస వాహన సేవ
- మే 18న ఉదయం – సింహ వాహనం.. రాత్రి – ముత్యపుపందిరి వాహనం.
- మే 19న ఉదయం – కల్పవృక్ష వాహనం.. రాత్రి – సర్వభూపాల వాహనం.
- మే 20న ఉదయం – మోహినీ అవతారం.. రాత్రి – గరుడ వాహనం.
- మే 21న ఉదయం – హనుమంత వాహనం.. రాత్రి – గజ వాహనం.
- మే 22న ఉదయం – సూర్యప్రభ వాహనం.. రాత్రి – చంద్రప్రభ వాహనం.
- మే 23న ఉదయం – రథోత్సవం.. రాత్రి – అశ్వవాహనం.
- మే 24న ఉదయం – చక్రస్నానం.. రాత్రి – ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.