ఆదిలాబాద్ లో కరోనా ఎఫెక్టెడ్ ఏరియాలపై స్పెషల్ ఫోకస్

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రంలో ఏడు కేసులు నమోదు కాగా 19 వార్డులను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఇక్కడి నుంచి ప్రజలెవరినీ బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు . నిత్యావసర సరుకులు, పాలు, నీళ్లు, రేషన్‌‌‌‌ బియ్యం , కూరగాయలు, మెడిసిన్‌‌‌‌ ఇళ్ల వద్దకే సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు . ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని హాస్పిటల్‌కు తరలించేందుకు సురక్ష పేరిట ఉచిత అంబులెన్స్ ‌‌‌లను సిద్ధంగా ఉంచారు. కలెక్టర్ శ్రీదేవసేన బుధవారం మీడియాతో మాట్లాడుతూ తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. జిల్లావ్యాప్తంగా 76మంది ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చారని, ఇందులో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. వారిని హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ హస్పిటల్ కు తరలించామన్నారు . ఒక వ్యక్తి ఇటీవల రావడంతో అతడి శాంపిల్స్‌‌‌‌ గురువారం పరీక్షల కోసం పంపిస్తామని చెప్పారు. వీరు కలిసిన 104 మందిని గుర్తించామని, ఇందులో 88 శాంపిల్స్‌‌‌‌ టెస్ట్‌‌‌ల కోసం పంపగా ఒకరికి పాజిటివ్‌‌‌‌ వచ్చిందని తెలిపారు. మరో 16మంది శాంపిల్స్ గురువారం టెస్టుల కోసం పంపించనున్నట్లు చెప్పారు.

నెగెటివ్ వచ్చిన వారు ఇంటికి..

మర్కజ్, ప్రైమరీ కాంటాక్ట్ పర్సన్లలో నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్ల నుంచి ఇండ్లకు పంపిస్తున్నారు. అయితే తాము ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించి హోం క్వారంటైన్‌‌‌‌లోనే ఉంటామనే సెల్ఫ్ డిక్లరేషన్లను  వారి నుంచి తీసుకుంటున్నారు. ఇందులో మర్కజ్‌‌‌‌కు వెళ్లి వచ్చిన వారు ఏప్రిల్ 21వరకు , ప్రైమరీ కాంటాక్ట్ పర్సన్లను ఏప్రిల్ 28వ తేదీ వరకు హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు . ఈ తేదీలతో కూడిన స్టాంప్లను చేతులపై వేసి పంపించనున్నారు.

 ఇంటింటిసర్వే..

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తిరిగిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు . ఆదిలాబాద్‌‌‌‌లోని 19 వార్డుల్లో 17,083 ఇండ్లలోని 63,765మందిని వంద టీంల ద్వారా, హస్నాపూర్లో 1,155 ఇండ్లలోని 4,695 మంది ని 25 టీంల ద్వారా, నేరడిగొండ మండల కేంద్రం లో 1,303 ఇండ్లలోని 4,384మందిని 25 టీంల ద్వారా సర్వే చేస్తున్నారు .

వార్డుకో స్పెషల్ ఆఫీసర్..

పట్టణంలోని 19 వార్డుల్లో ప్రజల పరిస్థితిని పర్యవేక్షిం చేందుకు 19 మంది స్పెషల్‌ ఆఫీసరను నియమించారు. యువకులతో ప్రత్యేకంగా గల్లీ వారియర్స్ ‌‌‌ను ఏర్పాటు చేశారు. 1,430మందిని ఇందుకోసం ఎంపిక చేశారు. ఎవరికైనా వైద్యసాయం అవసరమైతే అందించేందుకు వీలుగా జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్18004251939ను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే రోడ్లపైకి ప్రజలను అనుమతిస్తున్నారు. షాపులు ఆ టైం వరకే తెరిచి ఉంచుతున్నారు.

నిర్మల్‌‌‌‌లో పదికి చేరిన కేసులు..

నిర్మల్‌ జిల్లాలో బుధవారం ఒక్క రోజే ఆరు కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇందులో నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు . వీరి క్వారంటైన్‌‌‌‌ గడువు త్వరలో ముగియనున్న తరుణంలో, చివరి టెస్టులో  పాజిటివ్‌‌‌‌ వచ్చింది. వీరు లక్ష్మణ్‌ ‌‌‌చాంద మండలంలోని కనకాపూర్‌, రాయచూర్‌, మామడ మండలం న్యూలింగంపల్లి, పెంబి గ్రామాలకు చెందిన వారు. నిర్మల్‌లో ఒక కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్‌‌‌‌గా తేలింది. వీరి కుటుంబ సభ్యుడొకరు ఢిల్లీకి వెళ్లి రావడంతో ఆయన నుంచి వీరికి కరోనా సోకింది.

11మంది ఇంటికి..

నిర్మల్‌ జిల్లానుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో 11 మంది క్వారంటైన్‌‌ పూర్తవడంతో బుధవారం ఇంటికి పంపించారు. గడువు పూర్తయిన, నెగెటివ్‌ ‌రిపోర్టులు వచ్చిన వారందరినీ రెండు, మూడు రోజుల్లో ఇళ్లకు పంపిస్తామని కలెక్టర్  ముషారఫ్‌‌ అలీ తెలిపారు.