ప్రజావాణి అర్జీలపై స్పెషల్​ ఫోకస్

  • ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుల స్వీకరణ
  • సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ 

సూర్యాపేట, వెలుగు: ప్రతి వారం ప్రజావాణికి వచ్చే అర్జీలపై అధికారులు స్పెషల్​ ఫోకస్​ పెట్టనున్నారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు.  ఇకపై గ్రామ, మండల స్థాయిలోనే సమ్యలు పరిష్కారం కావాలని, ప్రతి ఫిర్యాదు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా కలెక్టర్​ వెంకట్రావు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రజావాణిలో వచ్చిన అర్జీల్లో 'ధరణి' సమస్యలే ఎక్కువ ఉన్నాయి.  

వాటిని త్వరగా పరిష్కరించాలని అర్జీదారులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మండల స్థాయిలో  వాటిని పట్టించుకోకపోవడంతో బాధితులు  జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణికి  వస్తున్నారు. అయినా వీటిపై అధికారుల పర్యవేక్షణ లేదని వారు ఆవేదన చెందుతున్నారు.  ఈ నేపథ్యంలో కలెక్టర్‌ వెంకట్రావు దృష్టి సారించారు. ప్రతి ఫిర్యాదు ఆన్‌లైన్‌చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రజావాణి సైట్  ను రెడీ చేస్తున్నారు.  ప్రజావాణి ఫిర్యాదులకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌విధానాన్ని పర్యవేక్షించనున్నారు.  అడిషనల్ కలెక్టర్లు, డీ‌ఆర్‌డీ‌ఓ, డీ‌ఈ‌ఓ, జడ్పీసీఈఈఓ, డీఎంహెచ్​ఓ తో కమిటీ నియమించి వారానికి ఒకసారి అధికారులతో రివ్యూ చేసి , అర్జీల పరిష్కారానికి కృషి చేయనున్నారు.