సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి : ఎం.శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు:  పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులను రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​ ఆదేశించారు. ఆదివారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ ఆడిటోరియంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ఏసీపీలు, సీఐలు, ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌వోలకు ఎన్నికల భద్రతపై అవగాహన మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ  పార్లమెంట్​ఎన్నికల కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, ఇందుకు ఆఫీసర్లు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు.

ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌కు లోబడి పనిచేయాలన్నారు. ఎన్నికల బందోబస్తు, సిబ్బంది మోహరింపు, కేంద్ర బలగాలతో సమన్వయం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నేర చరిత్ర ఉన్నవారు, రౌడీషీటర్లు, ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే వారికి కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలని, అవసరమైతే బైండోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలన్నారు. లైసెన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ వెపన్స్‌‌‌‌‌‌‌‌ ను డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలన్నారు.