సిద్దిపేట, గజ్వేల్‎పై స్పెషల్ ఫోకస్: మీనాక్షి నటరాజన్

సిద్దిపేట, గజ్వేల్‎పై స్పెషల్ ఫోకస్: మీనాక్షి నటరాజన్

హైదరాబాద్: సిద్దిపేట, గజ్వేల్ మీద ప్రత్యేక ఫోకస్ పెడతామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‎గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ తన యాక్షన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ మేరకు మంగళవారం (మార్చి 3) మెదక్ పార్లమెంట్ ముఖ్య నేతలతో గాంధీభవన్లో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలంటే పది ఏండ్లు పని చేసి ఉండాలని స్పష్టం చేశారు. 

కార్యకర్తలను ఎలా వాడుకోవాలో తెలుసని.. పార్టీ విజయం కోసం కష్టపడిన అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన కొత్త వారిని కలుపుకుని పోతామన్నారు. పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్‎లోనే చెప్పండని.. గాంధీ భవన్ బయట మాట్లాడొద్దని సూచించారు. అలాగే.. మంత్రులు తప్పొప్పులు కూడా మీటింగ్‎లోనే చెప్పండని.. అంతేకానీ ప్రత్యేక సమావేశాలు పెట్టడం.. సోషల్ మీడియాలో పెట్టడం వంటివి చేసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయొద్దన్నారు. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.