వికారాబాద్​ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ

వికారాబాద్​ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ

అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్ 

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్ జిల్లాకు అధిక నిధులు కేటాయించి రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్​అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించారు. తొలుత మర్పల్లి మండలం రావులపల్లిలో పార్వతీ సమేత పీతాంబరేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవానికి హాజరయ్యారు.

 మర్పల్లి మండలంలో ఆర్అండ్​బీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రోడ్ల బాగుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వికారాబాద్​ మండలంలోని పులుసుమామడి గ్రామ శివారులో పరమేశ్వరుడి గుట్టపై ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్​రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​కిషన్ నాయక్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.