ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్‌‌‌‌

ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్‌‌‌‌

వరంగల్, వెలుగు : రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్‌‌‌‌ను అభివృద్ధి చేస్తామన్న కాంగ్రెస్‌‌‌‌ ఎన్నికల హామీ నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ‘రాష్ట్ర రెండో రాజధాని.. వరంగల్‌‌‌‌’ అంశాన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పలుమార్లు ప్రస్తావించారు. హైదరాబాద్‌‌‌‌ తర్వాత ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఏండ్ల తరబడి నెరవేరని ప్రాజెక్ట్‌‌‌‌లతో పాటు గత పదేండ్లలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పట్టించుకోని పనులను సైతం తమ హయాంలోనే పూర్తి చేస్తామని మాటిచ్చారు. చెప్పినట్లుగానే ఓరుగల్లు జనాల చిరకాలవాంఛ అయిన అనేక మేజర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లపై రేవంత్‌‌‌‌రెడ్డి సర్కార్‌‌‌‌ దృష్టి పెట్టింది. అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా క్లియర్‌‌‌‌ చేస్తూ, ప్రభుత్వపరంగా కావాల్సిన ఆర్డర్స్‌‌‌‌ ఇస్తూ వరంగల్‌‌‌‌ నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

వరంగల్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లపై స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఎన్నికల టైంలో పలు హామీలు, ప్రాజెక్ట్‌‌‌‌లపై ప్రభుత్వం స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టింది. మామునూరు ఎయిర్‌‌‌‌పోర్టు విషయంలో సమైక్య, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పదేండ్ల పాలనలో పట్టించుకోని జీఎంఆర్‌‌‌‌ సంస్థతో ఒప్పందం, రైతుల నుంచి భూసేకరణ అంశాలపై రేవంత్‌‌‌‌రెడ్డి చొరవ తీసుకున్నారు. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ను మూడేండ్లలో అందుబాటులోకి తీసుకురావాలని గడువు పెట్టుకున్నారు. వరంగల్‌‌‌‌ తూర్పులో భద్రకాళి, బొందివాగు వంటి నాలాల అభివృద్ధికి రూ.158 కోట్లు మంజూరు చేశారు. మెగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కంపెనీలను త్వరగా ప్రారంభించడానికి తోడు స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేలా ఆయా సంస్థలతో మాట్లాడారు. 

బాధిత రైతుల కోసం టౌన్‌‌‌‌షిప్‌‌‌‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సిటీలో భద్రకాళి మాఢవీధుల నిర్మాణానికి మొదటి దశలో రూ.30 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, భద్రకాళి చెరువు పూడికతీత పనులను కేవలం నాలుగు రోజుల్లో మొదలుపెట్టారు. కొత్త మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌, అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్‌‌‌‌ల తయారీని కన్సల్టెన్సీలకు అప్పగించారు. వరంగల్‌‌‌‌ పాలిటెక్నిక్‌‌‌‌ కాలేజీ కొత్త బిల్డింగ్‌‌‌‌ కోసం రూ.28 కోట్లు మంజూరు చేశారు.

జెట్‌‌‌‌ స్పీడ్‌‌‌‌తో కాళోజీ కళాక్షేత్రం, నయీంనగర్‌‌‌‌ నాలా పనులు

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ ఏర్పడిన రెండు నెలల్లోనే కాళోజీ కళాక్షేత్రం పనులను మొదలుపెట్టింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.50 కోట్ల పెండింగ్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ను విడుదల చేసి, పనులను పూర్తి చేయించింది. వరంగల్‌‌‌‌ నగరం ఏటా వరదలో మునగడానికి కారణమయ్యే నయీంనగర్‌‌‌‌ నాలా ఆక్రమణల తొలగింపు, విస్తరణ, ఇరువైపులా రిటర్నింగ్‌‌‌‌ వాల్‌‌‌‌ నిర్మాణ పనులను మూడు నెలల్లోనే కంప్లీట్‌‌‌‌ చేశారు. హనుమకొండ–కరీంగనర్‌‌‌‌ మెయిన్‌‌‌‌రోడ్‌‌‌‌లో ఉండే నయీంనగర్‌‌‌‌ బ్రిడ్జిని కేవలం నాలుగు నెలల్లోనే సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వీటికి కావాల్సిన దాదాపు రూ.95 కోట్లను సకాలంలో విడుదల చేయడంతో.. పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో చేయలేని పనులను కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఐదారు నెలల్లో చేసి చూపింది.

‘దేశంలో గొప్ప చారిత్రక నగరంగా అభివృద్ధి చెందాల్సిన ఓరుగల్లు పదేండ్ల కేసీఆర్‌‌‌‌ పాలనలో మసకబారింది. వరంగల్‌‌‌‌ను రాష్ట్రానికి రెండో రాజధాని చేస్తాం. ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు, మామునూరు ఎయిర్‌‌‌‌ పోర్ట్‌‌‌‌, కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఏర్పాటుతో పాటు నగరంలో అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ నిర్మించి వరంగల్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేసే బాధ్యత నాది’
– మే 7న వరంగల్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్​రెడ్డి

పదేండ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలే...

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పదేండ్ల పాటు హామీలు, శంకుస్థాపనలతోనే కాలం గడిపింది తప్పితే ఏ ఒక్క ప్రాజెక్ట్‌‌‌‌ను పూర్తి చేయలేదు. మామునూర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ పునఃప్రారంభం విషయంలో భూములు ఇవ్వాలని కేంద్రం అడిగితే.. ఏదో ఒక సాగు చెప్పి సమయం వృథా చేసింది తప్పితే భూములను మాత్రం అప్పగించలేదు. జీఎంఆర్‌‌‌‌తో ఉన్న 150 కిలోమీటర్ల అంశాన్ని సైతం క్లియర్‌‌‌‌ చేయలేకపోయింది. వరంగల్‌‌‌‌ నగరంలో అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ తానే నిర్మిస్తానని సీఎం అయ్యాక 2015 వరంగల్‌‌‌‌ పర్యటనలో చెప్పిన కేసీఆర్‌‌‌‌... కనీసం డీపీఆర్‌‌‌‌ కూడా రూపొందించలేకపోయారు. 2013లో ఆఫీసర్లు రూపొందించిన మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌ను అమలుచేయలేదు. సిటీ పరిధిలోని నయీంనగర్, వరంగల్‌‌‌‌ తూర్పు నాలాలను వెడల్పు చేయలేదు. 

కాళోజీ కళాక్షేత్రం పనులను తొమ్మిదేండ్ల పాటు పిల్లర్లు, స్లాబ్‌‌‌‌లకే పరిమితం చేశారు. కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌ను ఏడాదిలో పూర్తి చేసి 60 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2016లో రైతుల నుంచి 1200 ఎకరాల భూములు గుంజుకొని కనీసం 500 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కాజీపేట నుంచి హనుమకొండ మీదుగా వరంగల్‌‌‌‌ వరకు నానో లేదంటే మోనో మెట్రో రైల్‌‌‌‌ ట్రాక్‌‌‌‌ వేస్తామన్న హామీ సైతం కనీసం పేపర్‌‌‌‌ మీదకు కూడా రాలేదు. చివరకు ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న భద్రకాళి మాఢవీధుల నిర్మాణ పనులు ఏడాదిన్నర దాటినా పేపర్‌‌‌‌ మీదే ఉండిపోయాయి.