ఉపాధి కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి : షఫీఉల్లా

  •     గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ షఫీఉల్లా

నస్పూర్/జైపూర్, వెలుగు: ఉపాధి హామీ పథకం అమలు, పంచాయతీల అభివృద్ధిలో మంచిర్యాల జిల్లా మార్క్ కనిపించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ షఫీఉల్లా అన్నారు. జిల్లాలోని భీమారం, చెన్నూర్ మండలాల్లో ఉపాధి హామీ పథకం క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ బదావత్ సంతోష్​తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ ​నిర్వహించి మాట్లాడారు.

ఉపాధి కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. కూలీలకు కచ్చితంగా 100 రోజుల పని కల్పించి. ప్రతి కూలీకి రూ.250 కనీస వేతనం వేతనం చెల్లించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ మురళీధర్, జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి కిషన్, పంచాయతీ అధికారి కిషన్ తదితరులు పాల్గొన్నారు.