ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ మీటింగ్ హల్ లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డాక్టర్. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 45 వినతులు గ్రీవెన్స్ కు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, డీఆర్వో రాజేశ్వరి, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రికొత్తగూడెం : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్పెట్టాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీవెన్స్ దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో మారు మూల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారన్నారు. ఈ ప్రోగ్రాంలో కలెక్టరేట్ ఏఓ రమాదేవితో పాటు జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.