ఇండియన్ కంపెనీలపై రష్యా దాడులు..ఫార్మా గోడౌన్లు ధ్వంసం

ఇండియన్ కంపెనీలపై రష్యా దాడులు..ఫార్మా గోడౌన్లు ధ్వంసం


ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం(ఏప్రిల్12) రష్యా జరిపిన మిస్సైల్ దాడుల్లో ఇండియాకు చెందిన ఫార్మాకంపెనీ గోడౌన్ పూర్తిగా ధ్వంసమైందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది. భారత ఔషధ కంపెనీపై క్షిపణి దాడి, ఫార్మసీ గోదాం నుంచి మంటల చెలరేగుతున్న ఫొటోలను X లో పోస్ట్ చేసింది. పుతిన్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దాడి చేసిందని విమర్శించింది. భారత్ తో స్నేహం అంటూనే మాస్కో ఉద్దేశపూర్వకంగా భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. పిల్లలు, వృద్ధులకోసం తయారు చేస్తున్న మందుల కంపెనీలను నాశనం చేస్తోంది భారత్ లోని ఉక్రెయిన్ ఎంబసీ వెల్లడించింది. 

రష్యా , ఉక్రెయిన్ యుద్దం ముదురు నేపథ్యంలో భారత్ యుద్దానికి వ్యతిరేకం అని ప్రకటించిన తర్వాత ఇది జరిగింది. ప్రధాని మోదీ శాంతిని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.  యుద్ధ బూమిలో ఎప్పటికీ పరిష్కారం దొరకదని ప్రధాని మోదీ రెండు దేశాలకు హితవు చెప్పారు. స్నేహం నటిస్తూనే భారత్ కు చెందిన వ్యాపారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవడం ఉక్రెయిన్ ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. 

గత నెలలో రష్యా, ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే సౌదీ అరేబియాలో అమెరికా అధికారులతో విడివిడిగా చర్చలు జరిపిన అనంతరం కాల్పుల విరమణపై వేర్వేరు ప్రకటనలు చేశారు. అనంతరం ఉక్రెయిన్, రష్యా పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ ఉక్రెయిన్ తమపై దాడులు చేస్తూనే ఉంది.. ఇప్పటివరకు 60 కంటే ఎక్కువ సార్లు తమపై దాడి చేసిందని రష్యా విదేశాంగ మంత్రి ప్రకటించారు. 

అయితే రష్యా వాదనలు ఉక్రెయిన్ ఖండించింది. రష్యానే ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుందని ఆరోపించింది. దాదాపు 70 మిస్సైల్స్ , 2200 లకు పైగా డ్రోన్లు, 6వేల కంటే ఎక్కువ వైమానిక దాడులు రష్యా ఉక్రెయిన్ చేసిందని వెల్లడించింది. ఈ దాడులు ఎక్కువగా ఉక్రెయిన్ పౌరులపై జరిగాయని తెలిపింది.