దివ్యాంగుల ఉపాధి అవకాశాలకు ప్రత్యేక జాబ్ పోర్టల్

దివ్యాంగుల ఉపాధి అవకాశాలకు ప్రత్యేక జాబ్ పోర్టల్
  • ఆవిష్కరించనున్న మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత చేరువ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఆన్ లైన్ జాబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సెక్రరిటేరియెట్ లో దివ్యాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్ ను మంత్రి సీతక్క ఆవిష్కరించనున్నారు. vikalangulajobportal.telangana.gov.in పోర్టల్ లో నిరుద్యోగ వికలాంగులు తమ వివరాలు నమోదు చేసుకుంటే ప్రైవేట్ కంపెనీలో వారికి తగిన ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనున్నది.  యూత్4 జా బ్స్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ ఆన్ లైన్ పోర్టల్ ను రూపొందించింది.