
షుగర్‌తో బాధపడేవాళ్లకోసం మార్కెట్లో రకరకాల పేర్లతో ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మిల్లెట్స్ ఈ ఉధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పేరు. జొన్న గట్క గురించి వినే ఉంటారు. పచ్చ జొన్నలతో చేసే ఈ గట్క తింటే క్యాన్సర్ దగ్గరికి రాకండా చూసుకోవచ్చు. షుగర్‌తో బాధపడేవాళ్లు దీన్ని తినొచ్చు. మేక తలకాయ కూరతో జొన్న గట్క తింటే మంచి రుచి కూడా ఉంటుంది. అది లేదంటే, ఉల్లిగడ్డ పులుసు కూడా మంచి ఆప్షన్. ఇంకేం మరి.. వండండి.. తినండి..!
జొన్న గట్క
- కావాల్సినవి: పచ్చ జొన్న రవ్వ ఒక కప్పు,
- నీళ్లు: రెండు కప్పులు
- ఉప్పు: తగినంత
- తయారీ: గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి మరిగించాలి. తర్వాత జొన్న రవ్వను కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉడకబెట్టాలి. రవ్వ ఉడికాక ఉప్పం వేసి దించేయాలి. దీన్ని మజ్జిగ, చిన్న ఉల్లిగడ్డ పులుసు లేదా మేక మాంసంతో తింటే బాగుంటుంది..
-
చిన్న ఉల్లిగడ్డ పులుసు
- చిన్న ఉల్లిగడ్డలు: కిలో
- చింతపండు గుజ్జు: ఒక కప్పు
- పసుపు: పావు టీ స్పూన్
- జీలకర్ర: రెండు టీ స్పూన్లు
- మెంతులు: ఒక టీ స్పూన్
- పచ్చిమిర్చి: రెండు
- కరివేపాకు రెండు రెమ్మలు
- అల్లం ముద్ద: ఒక టీ స్పూన్
- కారం: రెండు టేబుల్ స్పూన్లు
- ధనియాల పొడి: ఒక టేబుల్ స్పూన్
- కొబ్బరి పొడి: ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు తగినంత
- నూనె: తగినంత
తయారీ: ఉల్లిగడ్డలు పొట్టు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాన్‌లో నూనె వేయకుండా జీలకర్ర, మెంతులు వేగించి పొడి చెయ్యాలి. స్టవ్ పై బాండీ పెట్టి నూనె వేడి చెయ్యాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కొద్ది సేపు వేగించి ఉల్లిగడ్డలు వెయ్యాలి. పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు వేసి ఉడికించాలి. పది నిమిషాలు ఉడికాక కొబ్బరి పొడి, జీలకర్ర. మంతుల పొడి, ధనియాల పొడి వేసి రెండు. నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఉల్లిగడ్డల పులుసు రెడీ.