
- రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం చేతుల మీదుగా అందుకున్న సెక్రటరీ సైదులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మహాత్మా జ్యోతిబాఫూలే (ఎంజేపీ) గురుకుల విద్యాసంస్థల విద్యార్థులను స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సొసైటీ సెక్రటరీ సైదులు అవార్డును అందుకున్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో నాగార్జునసాగర్, కొలిముంతలపాడు
కమలాపూర్ స్కూల్ స్టూడెంట్లు 70 మంది మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపించడంతో గురుకుల స్టూడెంట్లకు స్పెషల్ జ్యూరీ అవార్డు అందించారు. ఈ సందర్భంగా సీఎం గురుకుల సెక్రటరీ సైదులును అభినందించారు. స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న విద్యార్థులను బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందించారు.