కాలేయ వ్యాధిగ్రస్తులకు 50% వేతనంతో ప్రత్యేక సెలవు..ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి

కాలేయ వ్యాధిగ్రస్తులకు 50% వేతనంతో ప్రత్యేక సెలవు..ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి

హైదరాబాద్, వెలుగు: లివర్ సిరోసిస్(కాలేయ వ్యాధి)తో బాధపడుతున్న సింగరేణి కార్మికులకు 50 శాతం వేతనంతో ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఎన్సీడబ్ల్యూఏ 11వ వేతన ఒప్పందంలో భాగంగా తీసుకున్నారు. ఇప్పటివరకు గుండె జబ్బు, క్షయ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, మూత్రపిండ వ్యాధులు, ఎయిడ్స్, మెదడు వ్యాధులకు మాత్రమే ఈ వెసులుబాటు అందుబాటులో ఉండగా, ఇకపై కాలేయ వ్యాధి బాధితులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. వ్యాధి నయమై, విధులకు సిద్ధమయ్యే వరకు కార్మికులకు బేసిక్ పే, వీడీఏ, ఎస్‌‌‌‌డీఏలో 50 శాతం చెల్లించనున్నారు. సంస్థ చైర్మన్ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు జీఎం(పర్సనల్, ఐఆర్ & పీఎం) బుధవారం ఈ సర్క్యులర్‌‌‌‌ను జారీ చేశారు.