MASS FEAST Movie: వందకోట్ల బాక్సాఫీస్ హిట్ మూవీ రూ.99లకే.. ఈ ఒక్కరోజే ఆఫర్.. ఏ థియేటర్స్లో అంటే?

MASS FEAST Movie: వందకోట్ల బాక్సాఫీస్ హిట్ మూవీ రూ.99లకే.. ఈ ఒక్కరోజే ఆఫర్.. ఏ థియేటర్స్లో అంటే?

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని జాట్ మూవీతో 'భారీ' హిట్ అందుకున్నాడు. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో హిందీ గడ్డపై సినిమా తీసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రిలీజై 20 రోజులు గడుస్తున్నా.. హిందీనాట వసూళ్లతో పర్వాలేదనిపిస్తుంది. 

ఈ క్రమంలోనే ఆడియాన్స్కు జాట్ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. నేడు ఏప్రిల్ 29న PVR INOXలో రూ.99లు పెట్టి సినిమా చూడొచ్చని తెలిపారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేస్తూ.. 'మాస్ ఫీస్ట్ కోసం రూ.99లతో మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి!' అంటూ తెలిపారు. అయితే, ఈ ఆఫర్ ఒక్కరోజే ఉండనుంది. ఈ సీజన్లో హిందీ గడ్డపై తెలుగోడి తెరకెక్కించిన మాస్ కమర్షియల్ సినిమా ఇది. జాట్ వరల్డ్ వైడ్ 110 కోట్ల గ్రాస్ సాధించగా.. ఇండియా వైడ్ గా రూ.85కోట్ల నెట్ వసూళ్లు చేసింది.

ఈ మూవీ సన్నీ డియోల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా 'జాట్' నిలిచింది. అయితే, మధ్యలో 'కేసరి చాప్టర్ 2' ఏప్రిల్ 18న రిలీజై  జాట్ వసూళ్లను తగ్గించేలా చేసింది. 

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రెజీనా, స‌యామీఖేర్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. రణదీప్ హుడా మరియు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.