మేడారం జాతర నిర్వహణకు నోడల్ ఆఫీసర్లు

  • ఐదుగురు ఐఏఎస్ లకు బాధ్యతలు

ములుగు, వెలుగు : మేడారం మహాజాతర నిర్వహణ, ఏర్పాట్లపై పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్​ఆర్ వీ కర్ణన్, గతంలో ములుగు కలెక్టర్ గా పనిచేసిన, ప్రస్తుత కార్మిక శాఖ డైరెక్టర్​ఎస్.కృష్ణ ఆదిత్య, గతంలో ములుగు అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభిలతో పాటు రంగారెడ్డి, హనుమకొండ అడిషనల్ కలెక్టర్లు ప్రతిమాసింగ్, రాధిక గుప్తాలను నోడల్ ఆఫీసర్లకు నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఆర్డర్స్ జారీ చేశారు.

వీరు ఈ నెల 26 వరకు జాతర నిర్వహణలో భాగస్వాములు కానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగుండా ఏర్పాట్లు చేస్తామని, మహాజాతరను సక్సెస్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని నోడల్ ఆఫీసర్లు చెప్పారు.