నిజామాబాద్ సిటీ, వెలుగు : తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్లకు ఓపీ సేవలు అందుబాటులో వచ్చాయని, ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల ప్రత్యేక ఓపీ బ్లాక్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ట్రాన్స్ జెండర్లు నిత్యం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుంటారని చెప్పారు. తమ ఆరోగ్య సమస్యలు ఏ డాక్టర్ కు చూపించుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతుంటారన్నారు. కార్యక్రమంలో డీసీపీ కోటేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ శేషాద్రి రెడ్డి, ట్రాన్స్ జెండర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.