ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు సందర్శించారు. గుట్టపై ఉన్న శివాలయం, రామాలయం, దత్తాత్రేయ, అయ్యప్ప మందిరాల్లో పురోహితులు కుమార్ శర్మ, నందీశ్వర మహరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
భారత్ గ్యాస్ తిరుమల, సుమన్ దంపతుల ఆధ్వర్యంలో సత్యనారాయణ వ్రతపూజ చేసి నందీశ్వర మహరాజ్ కు పాదపూజ చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఉత్సవమూర్తులతో రామాలయం నుంచి జీవ కోనేరు వరకు పల్లకీసేవ నిర్వహించారు.
భజన మండలి భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. తహసీల్ ఆఫీస్సమీపంలోని నాగలింగేశ్వర మందిరంలో ఉదయం, రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మందిర కమిటీ, అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు, భజనా మండలి భక్తులు పాల్గొన్నారు.