
మహబూబ్‌నగర్, వెలుగు : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు ఆదివారం కావడంతో గణనాథులు ప్రత్యేక పూజలు అందుకున్నారు. తీరొక్క రూపంలో దర్శనమిచ్చారు. వరుసగా శని, ఆదివారాల్లో సెలవులు రావడంతో వినాయక మండలాల వద్ద దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. కొన్ని చోట్ల ఆదివారం వినాయక నిమజ్జనాలు జరిగాయి. మహబూబ్‌నగర్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సోమవారం వినాయక నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.