ప్రతిమ గ్రూప్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాస్ రావుకు చెందిన హెలీకాఫ్టర్కు యాదగిరిగుట్టలో పూజలు చేశారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. బోయినపల్లి శ్రీనివాస్ రావు సుమారు 20 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. వరంగల్లో నిర్మించిన ప్రతిమ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఇటీవలె ప్రారంభించారు.