హైదరాబాద్, వెలుగు : దసరా పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఆదివారం మేయర్ గద్వాల్విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి తమ చాంబర్లలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. సిటిజన్లు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని దుర్గామాతను వేడుకున్నట్లు తెలిపారు.
దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజిస్తే అన్ని బాధలు పోతాయని జనాల విశ్వాసమని ఆమె చెప్పారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ సిటిజన్లకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షడు శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.