జాబ్స్​ ఇప్పించేందుకు స్పెషల్​ పోర్టల్

జాబ్స్​ ఇప్పించేందుకు స్పెషల్​ పోర్టల్

‘సాక్షమ్​’ పేరుతో స్టార్ట్​ చేసిన కేంద్ర ప్రభుత్వం
స్కిల్​ డెవలప్​మెంట్​పైనా ఫోకస్​​

న్యూఢిల్లీ: నిరుద్యోగులకు చిన్న ఇండస్ట్రీల్లో జాబ్స్ ఇప్పించడానికి, స్కిల్స్ డెవలప్​ చేయడానికి కేంద్రం ప్రభుత్వం ‘సాక్షమ్​’ పేరుతో ప్రత్యేక పోర్టల్​ను స్టార్ట్​ చేసింది. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీకి (డీఎస్టీ) చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్​కాస్టింగ్​ అండ్ అసెస్​మెంట్​ కౌన్సిల్​ (టిఫాక్​) దీనిని రూపొందించింది. సంస్థ 34వ బర్త్​డేను పురస్కరించుకొని పోర్టల్​ను స్టార్ట్​ చేసింది. దీనిసాయంతో దళారుల, లేబర్​ కాంట్రాక్టర్ల బెడదను తొలగించవచ్చని, కార్మికుల్లో స్కిల్స్​ఏ మేరకు ఉన్నాయో గుర్తించి   స్కిల్​కార్డ్స్​ కూడా ఇవ్వొచ్చని తెలిపింది. ‘‘సాక్షమ్​ పోర్టల్​సాయంతో దేశంలోని 10 లక్షల మంది కార్మికులకు చిన్న ఇండస్ట్రీల్లో జాబ్స్ ఇప్పించవచ్చు. దళారుల బెడద లేకుండా తమకు దగ్గర్లోని ఇండస్ట్రీల్లో నేరుగా జాబ్స్​పొందవచ్చు”అని వివరించింది. తాము తీసుకున్న చర్యల వల్ల ఎన్నో స్టార్టప్​లు కూడా మొదలయ్యాయని డీఎస్టీ ప్రకటించింది. యూత్​లో నమ్మకాన్ని పెంచగలిగితే మరిన్ని స్టార్టప్​లు వస్తాయని సంస్థ సెక్రటరీ ఆశుతోష్​ వర్మ అన్నారు.  కార్యక్రమంలో పలువురు డీఎస్టీ ఆఫీసర్లు, టిఫాక్​ చైర్మన్​ హోదాలో సారస్వత్​ పాల్గొన్నారు.

స్కిల్స్పై స్పెషల్ఫోకస్


అన్ని రాష్ట్రాల్లోని చిన్న ఇండస్ట్రీల అవసరాలు తీర్చడానికి సాక్షమ్​ పోర్టల్​ స్కిల్​మ్యాపింగ్​ఎక్సర్​సైజ్​నిర్వహిస్తుంది. కరోనా వల్ల సొంతూళ్లకు వెళ్లిన వలసకూలీలకు దీని ద్వారా జాబ్స్​ దొరుకుతాయి. స్కిల్స్​ కూడా నేర్చుకోవచ్చు.

ఈ పోర్టల్​ ద్వారా నిరుద్యోగిని గుర్తించాక, అతడు/ఆమెలోని స్కిల్​ లెవెల్స్​ను పరీక్షిస్తారు. అవి సంతృప్తికరంగా ఉంటే స్కిల్​కార్డు ఇస్తారు. వీటి సాయంతో లోకల్​ ఇండస్ట్రీల్లో జాబ్​ సంపాదించుకోవచ్చు.

సాక్షమ్​ డైరెక్ట్​గా చిన్న ఇండస్ట్రీలతో కనెక్ట్​ అవుతుంది. లేబర్​ కాంట్రాక్టర్ల పాత్ర ఏమీ ఉండదు. దీనివల్ల పది లక్షల మంది కార్మికులు నేరుగా ఇండస్ట్రీలను అప్రోచ్​ కావొచ్చు.

సముద్రపునాచు (సీవీడ్​) పెంపకం కోసం కూడా డీఎస్టీ స్కిల్​మ్యాపింగ్​ ఎక్సర్​సైజ్​లు నిర్వహించనుంది. సీవీడ్​పెంపకంపై ప్రభుత్వం ఇటీవల ఫోకస్​ చేసింది. దేశంలో కోటి హెక్టార్లలో సీవీడ్​ను సాగు చేస్తే ఐదు కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందని డీఎస్టీ అంచనా వేసింది.

జాబ్​ అవకాశాలు 

ఎడ్యుకేషన్​, రియల్టీ, ఇన్సూరెన్స్​సెక్టార్లలో హైరింగ్​

ముంబై: కరోనా కొట్టిన దెబ్బకు నష్టపోయిన చాలా సెక్టార్లు రికవరీ బాటలో నడుస్తున్నాయి. జాబ్స్​కూడా ఇవ్వడాన్ని మొదలుపెట్టాయి. ఎడ్యుకేషన్​, రియల్​ ఎస్టేట్, ఇన్సూరెన్స్​సెక్టార్లలో డిసెంబరు నుంచి సీక్వెన్షియల్​ హైరింగ్​ మొదలైంది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం గత డిసెంబరుతో పోలిస్తే జనవరిలో మాత్రం జాబ్​లిస్టింగ్స్ తక్కువగా కనిపించాయి. ఆటో, ఫార్మా వంటి సెక్టార్లలో నెగెటివ్​ గ్రోత్​ కనిపించడమే ఇందుకు కారణమని నౌకరీ జాబ్​స్పీక్​ఇండెక్స్​ వెల్లడించింది. ఈ కంపెనీ తన వెబ్​సైట్​ Naukri.com  లో ప్రతినెలా అప్​లోడ్​ అయిన జాబ్​లిస్టింగ్స్​ ఆధారంగా ఇండెక్స్​ను తయారు చేస్తుంది. జాబ్స్​లో పెరుగుదల, తగ్గుదలను స్టడీ చేస్తుంది. ఈ ఏడాది జనవరిలో 1,925 జాబ్​లిస్టింగ్స్​రాగా, గత జనవరిలో వీటి సంఖ్య 1,972. ఎడ్యుకేషన్​, టీచింగ్​ డొమైన్లలో హైరింగ్​డిసెంబరుతో పోలిస్తే జనవరిలో 11 శాతం పెరిగిందని నౌకరీ సీఈఓ పవన్​ గోయల్​ అన్నారు. మెల్లమెల్లగా అన్ని స్కూళ్లు, కాలేజీలు ఓపెన్​ అవుతుండటమే ఇందుకు కారణమని చెప్పారు. కరోనా కారణంగా హెల్త్​ ఇన్సూరెన్స్​కు డిమాండ్​ పెరగడంతో బీమారంగంలో కొత్త వారికి జాబ్స్​ ఇవ్వడం మొదలయింది. డిసెంబరుతో పోలిస్తే జనవరిలో ఇన్సూరెన్స్​ సెక్టార్​ హైరింగ్​ ఎనిమిది శాతం పెరిగింది. రిటైల్​లో 13 శాతం, బీఎఫ్​ఎస్​ఐలో ఐదుశాతం, బీపీఓ/ఐటీఈఎస్​సెక్టార్లలో హైరింగ్​మూడు శాతం పెరిగింది. అయితే ఆటో సెక్టార్​లో​ 14 శాతం, టెలికంలో 8 శాతం జాబ్​ లిస్టింగ్స్​ తగ్గిపోయాయి. ఈ రంగాల్లో ఇప్పటికీ స్లోడౌన్​ కనిపిస్తోంది. మెట్రో నగరాల్లోనూ గత నెల హైరింగ్​ పెరిగింది. వదోదరా సిటీ 9 శాతం జాబ్​ లిస్టింగ్స్​తో టాప్​లో నిలిచింది.