డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆకట్టుకునే సూర్య.. తాజాగా ‘కంగువా’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఆదివారం తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు సూర్య. పాస్ట్ అండ్ ప్రెజెంట్ లుక్స్ అంటూ రెండు డిఫరెంట్ గెటప్స్‌తో ఉన్న సూర్య పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ‘గతం మరియు ప్రస్తుతం ఢీకొంటే, కొత్త భవిష్యత్తు ప్రారంభమవుతుంది’ అని క్యాప్షన్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒక లుక్‌లో పోరాట యోధుడి పాత్రలో కనిపిస్తుంటే, మరో లుక్‌లో స్టైలిష్ క్యారెక్టర్‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు. సూర్య కెరీర్‌లో ఇది 42వ చిత్రం. దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీడియోల్ కీ రోల్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా పది భాషల్లో త్రీడీ ఫార్మట్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్‌డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.