మదన్​ గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు

లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి కాంగ్రెస్​పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.మదన్​మోహన్​రావు భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ మంగళవారం కర్నాటకలోని హజ్రత్​ఖాజా బందా నవాజ్​ రెహమతుల్లా దర్గాలో లింగంపేటకు చెందిన కాంగ్రెస్​ లీడర్లు ఖాసిఫ్​ మోహియొద్దీన్, సాజిద్,​ ఇమ్రాన్, ప్రసాద్ ​ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

నియోజకవర్గంలోని ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న మదన్​మోహన్​ గెలవాలని మొక్కుకునేందుకు లింగంపేట నుంచి కర్నాటక రాష్ట్రానికి వచ్చినట్లు ఖాషిఫ్​మోహియొద్దీన్​  తెలిపారు.