నస్పూర్, వెలుగు: జిల్లాలో మాత శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ లో అర్మాన్ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో మాత శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గర్భధారణ సమయంలో బరువు పెరగడం మొదలైన వాటిపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్మాన్ సంస్థకు చెందిన డాక్టర్ సౌజన్య, డాక్టర్ అనిల్, ప్రశాంత్ కుమార్, భాస్కర్, వైద్యులు డాక్టర్ కృపాబాయి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు ఎస్. అనిత, సీతారామరాజు, ప్రసాద్, అనిల్, మాస్ మీడియా అధికారి ఒక్క వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.